Science: 10 లక్షల ఏళ్ల నాటి ఘటన.. గుర్తుపట్టలేనంతా మారిపోయిన మనిషి మెదడు

Small tweak million years ago changed human brain forever
  • 10 లక్షల ఏళ్ల క్రితం జన్యువుల్లో కీలక మార్పులు
  • జన్యు ఉత్పరివర్తనాలతో మెదడులో కీలక మార్పులు
  • ఇతర క్షీరదాలతో పోలిస్తే భిన్నంగా మనిషి పరిణామక్రమం
  • యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్‌ఫ్రాన్‌‌సిస్కో పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
పది లక్షల ఏళ్ల క్రితం చోటుచేసుకున్న కొన్ని జన్యు మార్పులతో మనిషి మెదడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. మెదడు ఎదుగుదలను నియంత్రించే హ్యుమన్ అస్సెలరేటెడ్ రీజియన్స్ అనే ఎన్‌హాన్సర్ జన్యువుల్లో ఈ మార్పులు జరిగాయని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్‌సిస్కో శాస్త్రవేత్తల అధ్యయనంలో తాజాగా తేలింది. 

డా. కేటీ పోలార్డ్ నేతృత్వం వహించిన ఈ పరిశోధన తాలూకు వివరాలు సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. నాటి మార్పుల తాలూకు అవశేషాలు ఇప్పటికీ చింపాంజీల మెదళ్లల్లో చూడొచ్చని పరిశోధకులు చెప్పారు. ఈ మార్పుల కారణంగానే మనిషి ఇతర క్షీరదాల కంటే భిన్నంగా పరిణామం చెందాడని వివరించారు. ఈ మార్పుల ప్రభావం తాలూకు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
Science

More Telugu News