btech ravi: టీడీపీ నేత బీటెక్ రవికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

Btech Ravi gets anticipatory bail

  • ఓ స్థలం వివాదానికి సంబంధించి బీటెక్ రవితో పాటు 32 మందిపై కేసు
  • చక్రాయపేట పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ కేసు
  • ముందస్తు బెయిల్ కోరుతూ బీటెక్ రవి పిటిషన్ దాఖలు

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. గత నెల 30వ తేదీన బీటెక్ రవిపై చక్రాయపేట పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ కేసు నమోదయింది. ఓ స్థలం వివాదానికి సంబంధించి బీటెక్ రవితో పాటు 32 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బీటెక్ రవి ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

btech ravi
Telugudesam
  • Loading...

More Telugu News