COVID19: వేగంగా క్షీణిస్తున్న కరోనా.. వీక్లీ కేసుల్లో 57 శాతం తగ్గుదల
- వరుసగా రెండో వారంలో కొత్త కేసుల తగ్గుదల
- గతవారం 50,769లతో పోలిస్తే ఈవారం 21,798కి తగ్గిన కేసులు
- మరణాలు కూడా 131 నుండి 95కి తగ్గాయి
కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా రెండవ వారంలో కొత్త కేసులు బాగా తగ్గాయి. గత వారం కంటే సగానికి పైగా కేసులు తగ్గాయి. ఆదివారం (మే 1-7)తో ముగిసిన వారంలో భారతదేశంలో 21,798 కేసులు నమోదయ్యాయి. గతవారం 50,769 కేసులతో పోలిస్తే ఇది 57% తగ్గుదల. అంతకుముందు వారంలో మరణాలు 131 ఉండగా ఈ వారం 95కి తగ్గాయి. కొన్ని ఈశాన్య రాష్ట్రాలు మినహా భారతదేశంలో కేసుల సంఖ్య తగ్గింది. సోమవారం రాత్రి నాటికి, యాక్టివ్ కేసుల సంఖ్య వారం క్రితం 47,000 నుండి 25,000 కంటే తక్కువకు పడిపోయింది.