Vijay Devarakonda: విజయ్ దేవరకొండ వదిలేసిన సినిమాల్లో హిట్ కొట్టినవి ఇవే!

Vijay Devarakonda Special

  • హీరోగా ఒక రేంజ్ లో దూసుకెళ్లిన విజయ్ దేవరకొండ
  • ఆయన డేట్స్ కోసం పోటీపడిన మేకర్స్ 
  • కొన్ని కారణాల వలన ఆయన చేయలేకపోయిన సినిమాలు
  • ఆ జాబితాలో కనిపిస్తున్న మూడు బ్లాక్ బస్టర్లు  

విజయ్ దేవరకొండ కెరియర్ చిన్న సినిమాలతోనే మొదలైంది. వరుస బ్లాక్ బస్టర్ సినిమాలు ఆయన ఖాతాలో లేకపోయినా, యూత్ కి ఆయన కనెక్ట్ అయిన తీరే డిఫరెంట్ గా అనిపిస్తుంది. తన యాటిట్యూడ్ తోనే ఒక్కసారిగా ఆయన దూసుకెళ్లాడు. ఒకానొక దశలో ఆయన డేట్స్ కోసం మేకర్స్ పోటీపడ్డారు.

అలాంటి పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ కథలు నచ్చకపోవడం వలన .. డేట్లు కుదరకపోవడం వలన కొన్ని ప్రాజెక్టులను వదులుకోవలసి వచ్చింది. అలా ఆయన వదులుకున్న సినిమాల జాబితాలో 'భీష్మ' .. 'ఇస్మార్ట్ శంకర్' .. 'RX 100' సినిమాలు కనిపిస్తాయి. 

ముందుగా ఆ సినిమాల కథలను విజయ్ దేవరకొండనే విన్నాడట. అయితే అప్పుడు తానున్న పరిస్థితుల కారణంగా ఆ సినిమాలు చేయలేకపోయాడట. ఆ తరువాత 'భీష్మ' సినిమాతో నితిన్ .. 'ఇస్మార్ట్ శంకర్'తో రామ్ .. 'RX 100'తో కార్తికేయ హిట్ కొట్టారు. ఈ సినిమాలు విజయ్ దేవరకొండ చేసుంటే బాగుండునే అని ఆయన అభిమానులు అనుకోవడం సహజమే.


Vijay Devarakonda
Actor
Tollywood
  • Loading...

More Telugu News