Vijay Devarakonda: 'ఖుషి' నుంచి ఫస్టు సింగిల్ రిలీజ్

Khushi First Single Released

  • మరో ప్రేమకథా చిత్రంగా రూపొందిన 'ఖుషి'
  • సమంత - విజయ్ దేవరకొండ జంటగా చేసిన సందడి 
  • 'మజిలీ' తరువాత శివ నిర్వాణతో సమంత చేసిన సినిమా
  • సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు  

ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టుగా శివ నిర్వాణకి మంచి పేరు ఉంది. ఆయన తెరకెక్కించిన 'నిన్నుకోరి' .. 'మజిలీ' సినిమాలను ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. ఆయన దర్శకత్వంలో ఇప్పుడు మరో ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు రానుంది .. ఆ సినిమా పేరే ఖుషీ. ఈ సినిమాలో సమంత - విజయ్ దేవరకొండ జంటగా నటించారు. 

'మహానటి' సినిమాలో కలిసి కనిపించిన ఈ జోడీ ఇప్పుడు పూర్తిస్థాయిలో హీరో .. హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఇక 'మజిలీ' వంటి హిట్ తరువాత శివ నిర్వాణతో కలిసి సమంత చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా నుంచి కొంత సేపటి క్రితం, 'నా నువ్వే' అనే ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేశారు.

హేషం అబ్దుల్ వాహెబ్ స్వరపరిచిన ఈ పాటకు సాహిత్యాన్ని అందించగా, ఆలపించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో, సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. యూత్ కి ఈ సినిమా ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూడాలి.

Vijay Devarakonda
Samantha
Shiva Nirvana
Khushi Movie

More Telugu News