The Kerala Story: ఒంటరిగా బయటికొస్తే దబడి దిబిడే.. ‘కేరళ స్టోరీ’ చిత్ర‌బృందానికి హెచ్చరికలు

Warning to The Kerala Story Crew

  • దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌ల మ‌ధ్య విడుద‌లైన ది కేర‌ళ స్టోరీ
  • మీరు చేసింది స‌రికాదంటూ చిత్ర బృందానికి హెచ్చ‌రిక‌లు
  • భ‌ద్ర‌త క‌ల్పించిన పోలీసులు

వివాదాల నడుమ దేశవ్యాప్తంగా విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ సినిమా సంచలనం సృష్టిస్తోంది. సినిమాను నిషేధించాలన్న నిరసనల మధ్యే విడుదలైన ఈ సినిమా అనూహ్య వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాలోని నటీనటులకు, చిత్ర‌బృందానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈ మేరకు ఆ సినిమా దర్శకుడు సుదీప్తో సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మీరు చేసింది ఏమంత మంచి పని కాదని, కాబట్టి ఇంటి నుంచి ఒంటరిగా బయటకు వెళ్లే సాహసం చేయొద్దని హెచ్చరికలు వస్తున్నట్టు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారికి భద్రత కల్పించారు. అయితే, ఈ విషయమై లిఖితపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.

వివాహం తర్వాత ఇస్లాంలోకి మారిన ముగ్గురు యువతులు ఆ తర్వాత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) వలలో చిక్కుకుని ఎలాంటి పరిస్థితులు అనుభవించారన్నదే ఈ సినిమా వృత్తాంతం. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విముల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. దీనిని ‘ఆర్ఆర్ఎస్ ప్రచారం’గా అభివర్ణించారు. అ

దా శర్మ, యోగితా బిహాని, సిద్ధి ఇదాని, సోనియా బలాని ముఖ్య పాత్రలు పోషించారు. కేరళకు చెందిన 32 వేల మంది మహిళలు ఐఎస్‌లో చేరినట్టు చూపిస్తూ ట్రైలర్ విడుదల చేసిన తర్వాత సినిమాపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో వెనక్కి తగ్గిన చిత్ర బృందం 32 వేల మందిని అని కాకుండా ముగ్గురు మహిళలు అని మార్చింది. ‘ది కేరళ స్టోరీ’కి బీజేపీ పాలిత ప్రాంతమైన మధ్యప్రదేశ్‌లో టాక్స్ మినహాయింపు లభించింది.

The Kerala Story
Sudipto Sen
Bollywood
  • Loading...

More Telugu News