: సీబీఐ దర్యాప్తు హామీతో యాసిడ్ దాడి బాధితురాలి అంత్యక్రియలు


ముంబై యాసిడ్ దాడి ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర హోంమంత్రి హామీ ఇవ్వడంతో శనివారం మరణించిన ప్రీతి రాఠీ అంత్యక్రియలను ఇవాళ నిర్వహించారు. ఢిల్లీ నుంచి ముంబై ఉద్యోగం కోసం వెళ్లిన యువతిపై రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. దాడి జరిగి నెల రోజులు దాటినా నేరస్తుడిని పోలీసులు పట్టుకోలేకపోయారు. ఢిల్లీలో చికిత్స పొందుతూ ప్రీతి శనివారం మృతి చెందింది. తమ కుమార్తె దాడి ఘటనపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ప్రీతి మృతికి పరిహారంగా మహారాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు ఇస్తామని ప్రకటించడాన్ని బీజేపీ నేత సుష్మాస్వరాజ్ తప్పుపట్టారు. ప్రభుత్వ వ్యవహారం పుండు మీద కారం చల్లినట్టు ఉందని సుష్మ వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News