Jagan: మరోసారి విశాఖ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్

CM Jagan going to Vizag

  • ఈ నెల 11న విశాఖకు వెళ్తున్న జగన్
  • పీఎం పాలెం క్రికెట్ స్టేడియంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం
  • ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కుమారుడి వివాహానికి హాజరవనున్న ముఖ్యమంత్రి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 11న విశాఖలో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పీఎం పాలెంలోని క్రికెట్ స్టేడియంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం అరిలోవలో ఏర్పాటు చేసిన అపోలో కేన్సర్ సెంటర్ ను ప్రారంభిస్తారు. 

అనంతరం రామ్ నగర్ లోని వాణిజ్య సముదాయం, బీచ్ రోడ్ లోని సీ హారియర్ మ్యూజియం, ఎంవీపీ కాలనీలో ఉన్న ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాను సీఎం ప్రారంభిస్తారు. భీమిలిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్, యెండాడలో కాపు భవన్ లకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కుమారుడు సాయి వివాహానికి హాజరవుతారు. రాత్రి 7 గంలకు విశాఖ నుంచి తిరుగుపయనమవుతారు.

Jagan
YSRCP
Vizag
  • Loading...

More Telugu News