summer: రేపటి నుండి తెలంగాణాలో మరింత పెరగనున్న ఉష్ణోగ్రత!

Temperature will increase from tomorrow

  • నిన్నటి వరకు చల్లటి వాతావరణం
  • ఒక్కసారిగా వాతావరణంలో మార్పు
  • 40 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రత

మొన్నటి వరకు తెలంగాణవ్యాప్తంగా కాస్త చల్లటి వాతావరణం కనిపించింది. కానీ సోమవారం మాత్రం ఎండను, ఉక్కపోతను తట్టుకోలేని పరిస్థితి కనిపించింది. రాష్ట్రంలో అకాల వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ సోమవారం నుండి వాతావరణం మారిపోయింది. ఎండ తీవ్రత పెరిగింది. ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఇప్పుడు 40 డిగ్రీలకు చేరుకున్నాయి.

బుధవారం నుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, మంగళవారం నుండి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఒకటి రెండు ప్రదేశాలలో 40 డిగ్రీల నుండి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలిపింది.

summer
hot
  • Loading...

More Telugu News