Heroin: శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.41 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

Heroin worth Rs 41 crores seized at Shamshabad airport

  • మలావీ నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళ
  • సూట్ కేసులో హెరాయిన్ దాచి తరలించే ప్రయత్నం
  • డీఆర్ఐ అధికారుల తనిఖీలో బయటపడిన హెరాయిన్
  • 5.9 కిలోల హెరాయిన్ స్వాధీనం

హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెద్ద మొత్తంలో హెరాయిన్ పట్టుబడింది. ఓ మహిళ నుంచి 5.9 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. లభ్యమైన హెరాయిన్ విలువ రూ.41.3 కోట్లు ఉంటుందని అంచనా. కాగా, ఆ మహిళ మలావీ దేశం నుంచి హైదరాబాద్ వచ్చింది.  

ఈ హెరాయిన్ ను సూట్ కేసులో దాచి తరలించేందుకు ప్రయత్నించింది. డీఆర్ఐ అధికారుల తనిఖీలో ఈ హెరాయిన్ బయటపడింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో గతంలోనూ మాదకద్రవ్యాలు, బంగారం పెద్ద మొత్తంలో పట్టుబడడం తెలిసిందే.

More Telugu News