Karnataka: కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి తెర.. మూగబోయిన మైకులు

Karnataka Election 2023 Campaigning ends

  • ఎల్లుండే కన్నడనాట ఓటింగ్
  • బరిలో 2,613 మంది అభ్యర్థులు
  • మే 13వ తేదీన తేలనున్న పార్టీల భవితవ్యం!

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం తెరపడింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ సహా వివిధ పార్టీలకు చెందిన నాయకులు పోటాపోటీగా ప్రచారం సాగించారు. ఈ ప్రచార అంకానికి నేడు తెరపడింది. నెల రోజులకు పైగా వివిధ ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు, రోడ్డు షోలు నిర్వహించారు. ఎల్లుండి ఓటింగ్ నేపథ్యంలో మైకులు మూగబోయాయి. 

కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మే 10వ తేదీన పోలింగ్ జరగనుంది. 13వ తారీఖున ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో 918 మంది స్వతంత్రులతో కలిపి 2,613 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రతిసారి రెండో పార్టీకి పట్టం గట్టే కన్నడ ప్రజలు ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే ఆసక్తి అందరిలోను నెలకొంది.

More Telugu News