Asaduddin Owaisi: ఐసిస్ ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్నా: అసదుద్దీన్ ఒవైసీ

Iam in ISIS hit list says Owaisi

  • బెంగళూరులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఒవైసీ
  • తనను చంపుతామని ఐసిస్ ప్రకటించిందన్న ఎంఐఎం అధినేత
  • సినిమా ప్రమోషన్ కోసం మోదీ బెంగళూరుకు వచ్చారని విమర్శ

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్ హిట్ లిస్ట్ లో తాను ఉన్నానని ఆయన అన్నారు. తనను చంపుతామని ఇప్పటికే ఆ సంస్థ ప్రకటించిందని చెప్పారు. అయితే వారి హెచ్చరికలను తాను ఖాతరు చేయనని అన్నారు. బెంగళూరులో ఎంఐఎం నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇదే సమయంలో ప్రధాని మోదీపై ఆయన విమర్శలు గుప్పించారు. మణిపూర్ లో హింస చెలరేగుతుంటే దాన్ని పట్టించుకోకుండా బెంగళూరులో రోడ్ షోలలో బిజీగా ఉన్నారని విమర్శించారు. ఒక సినిమాను ప్రమోట్ చేయడం కోసం మోదీ బెంగళూరుకు వచ్చారని ఎద్దేవా చేశారు.  

Asaduddin Owaisi
MIM
ISIS
Narendra Modi
BJP
  • Loading...

More Telugu News