gold mines: పెరు బంగారు గనిలో అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి

At least 27 dead in Peru gold mine fire

  • నైట్ షిఫ్ట్‌లో ఉన్న 200 మందికి పైగా కార్మికులు
  • సురక్షితంగా బయటపడిన 175 మంది
  • రోదనలతో మిన్నంటిన ప్రాంతం

దక్షిణ అమెరికాలోని పెరులో ఘోరం జరిగింది. గోల్డ్ మైన్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో 27 మంది కార్మికులు మృత్యువాతపడ్డారు. ప్రమాదంలో మృతి చెందినవారు నైట్ షిఫ్ట్ లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవలి కాలంలో దేశంలో అత్యంత విషాదకర మైనింగ్ ప్రమాదం ఇదేనని అధికారులు చెబుతున్నారు. 

అరిక్విపా నగరానికి సమీపంలోని లాఎస్పరెంజా 1 గనిలో అగ్నిప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రాథమిక సమాచారం మేరకు షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించడంతో మంటలు వ్యాప్తి చెందాయని, ప్రమాదం సమయంలో గనిలో కార్మికులు వంద మీటర్ల లోతున పనులు చేస్తున్నారని చెప్పారు. 175 మంది సురక్షితంగా బయటపడగా, 27 మంది చనిపోయినట్లు చెప్పారు. పేలుడు ధాటికి గనిలోని చెక్క వస్తువులు కాలిపోయాయి. జరిగిన ప్రమాదం పట్ల తాము షాక్ కు గురయ్యామని చెప్పారు.

ఈ ప్రాంతమంతా రోదనలతో మిన్నంటింది. తమ కుటుంబ సభ్యులు మృతి చెందడంతో వారి వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. చనిపోయిన వారిలో 51 ఏళ్ల ఇడ్మే మమానీ ఉన్నాడు. డార్లింగ్ ఎక్కడ ఉన్నావు... నువ్వెక్కడ అంటూ అతని భార్య మెర్సిలీనా రోదించిన తీరు అందరినీ కదిలించింది.

gold mines
peru
gold
death
  • Loading...

More Telugu News