Saitej: 90 కోట్ల మార్కును దాటిన 'విరూపాక్ష'

Virupaksha Movie Update

  • ఇటీవలే థియేటర్లకు వచ్చిన 'విరూపాక్ష'
  • తొలి రోజునే 12 కోట్ల గ్రాస్ వసూళ్లు 
  • 4 రోజుల్లో 50 కోట్లు రాబట్టిన సినిమా 
  • త్వరలో 100 కోట్ల క్లబ్ లోకి చేరే ఛాన్స్

సాయితేజ్ హీరోగా రూపొందిన 'విరూపాక్ష' ఇటీవలే థియేటర్స్ కి వచ్చింది. దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఎవరికీ కూడా పెద్దగా తెలియదు. ఇంతకుముందు ఆయన చేసింది కూడా ఒక సినిమానే .. అది కూడా సరిగ్గా ఆడలేదు. ఇక సాయితేజ్ వరుస ఫ్లాపులతో ఉన్నాడు. పెద్ద బ్యానర్ .. సుకుమార్ స్క్రీన్ ప్లే చేశాడనేది ఈ సినిమాపై కొంతవరకూ బజ్ పెంచగలిగింది. 

అంతగా అంచనాలు లేకుండా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, సక్సెస్ టాక్ తెచ్చుకోవటానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజునే 12 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, 4 రోజుల్లో 50 కోట్ల వసూళ్లను రాబట్టింది. 13 రోజుల్లోనే 82 కోట్ల వరకూ వసూలు చేసిన ఈ సినిమా, ఇప్పుడు 91 కోట్ల గ్రాస్ ను సాధించింది. 

సాధారణంగా అడవి నేపథ్యంలోని కథ అనగానే ఒక ఆసక్తి మొదలవుతుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ అనగానే ఆడియన్స్ మరింత దగ్గరగా వెళతారు. ఇక క్షుద్ర శక్తులను ఎదిరించడంలో దైవ సహాయం తీసుకోవడం రొటీన్. కానీ ఈ సినిమాలో హీరో తన ధైర్య సాహసాలతోనే పరిస్థితిని ఎదుర్కొంటాడు .. అదే ఈ సినిమాలోని ప్రత్యేకత. త్వరలోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేసే అవకాశాలు ఉన్నాయి.

Saitej
Samyuktha Menon
Sonia Singh
Virupaksha Movie
  • Loading...

More Telugu News