Allu Arjun: బన్నీతో త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్!

Allu Arjun in Trivikram Movie

  • త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టిన బన్నీ 
  • మరో ప్రాజెక్టు దిశగా పడుతున్న అడుగులు 
  • మహేశ్ తరువాత బన్నీతోనే త్రివిక్రమ్ మూవీ 
  • బన్నీ కోసం లైన్లో ఉన్న బోయపాటి .. సురేందర్ రెడ్డి

త్రివిక్రమ్ తన సినిమాను ఏ ఒక్క వర్గానికో పరిమితం చేయడు. ఆయన సినిమాలను అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంటారు. అందువలన ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం వెయిట్ చేస్తుంటారు. ఒకానొక సమయంలో ఆయనతోనే సినిమా చేయాలనే ఉద్దేశంతో బన్నీ చాలా రోజుల పాటు వెయిట్ చేశాడు కూడా. 

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' .. 'అల వైకుంఠపురములో' సినిమాలు సంచలన విజయాలను అందుకున్నాయి. వసూళ్ల పరంగా కూడా ఈ సినిమాలు కొత్త రికార్డులను సెట్ చేశాయి. హ్యాట్రిక్ హిట్ అందుకున్న తరువాత ఈ ఇద్దరి నుంచి మరో ప్రాజెక్టు ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

ఆ దిశగా ప్రయత్నాలు మొదలైనట్టుగా కొన్ని రోజుల క్రితం ఒక టాక్ వచ్చింది. అది ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది. మహేశ్ బాబుతో సినిమా పూర్తికాగానే బన్నీతోనే త్రివిక్రమ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు. ఇక ఆ తరువాత బన్నీ చేసే ప్రాజెక్టులు బోయపాటితోను .. సురేందర్ రెడ్డితోను ఉన్నట్టుగా సమాచారం. మొత్తానికి బన్నీ స్టార్ డైరెక్టర్స్ ను రిపీట్ చేసే పనిలో ఉన్నాడన్న మాట. 

Allu Arjun
Trivikram Srinivas
Boyapati Sreenu
Surendar Reddy
  • Loading...

More Telugu News