Nara Lokesh: రాక్షసులతో పోరాడానికి మీ అండ కావాలి: లోకేశ్

Lokesh asks Muslims please support TDP

  • కర్నూలులో లోకేశ్ తో గుఫ్తగు కార్యక్రమం
  • ముస్లింలతో సమావేశమైన లోకేశ్
  • ముస్లింలు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన టీడీపీ అగ్రనేత
  • టీడీపీకి ముస్లింలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థత, చేతగానితనం వల్లే మైనారిటీలపై గతంలో ఎన్నడూ లేనివిధంగా దాడులు కొనసాగుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. కర్నూలులో 'లోకేశ్ తో గుఫ్తగు' కార్యక్రమంలో భాగంగా యువనేత లోకేశ్ ముస్లిం మైనారిటీ సోదరులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి సంధానకర్తలుగా కడపకు చెందిన డాక్టర్ నూరీ ఫర్వీన్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లీ వ్యవహరించారు. సమావేశంలో మైనారిటీ అడిగిన ప్రశ్నలకు లోకేశ్ ముక్కుసూటిగా సమాధానమిచ్చారు. రాక్షసులతో పోరాడడానికి మీ మద్దతు కావాలని ముస్లింలను కోరారు.

'లోకేశ్ తో గుఫ్తగు' కార్యక్రమంలో ముస్లిం సోదరుల ప్రశ్నలు, లోకేశ్ సమాధానాలు ఇలా ఉన్నాయి.

సంధానకర్త ప్రశ్న : రంజాన్ మాసంలో మా స్నేహితులు మా ఇంటికి విందుకు వచ్చేవారు... మీ స్నేహితుల ఇళ్లకు వెళ్లి రంజాన్ మాసంలో బిర్యానీ తిన్నారా?

లోకేశ్: నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. రంజాన్ మాసం వచ్చినప్పుడు మేము పాతబస్తీకి వెళ్లి హలీం, బిర్యానీ తింటాం. నేను ప్రస్తుతం పాదయాత్రలో ఉన్నందున బ్రాహ్మణి దేవాన్ష్ ను పాతబస్తీ తీసుకెళ్లి హలీం తినిపించారు. రంజాన్ మాసాన్ని ఆనందంగా జరుపుకుంటాం.

ప్రశ్న : విద్యా దీవెన కొందరికి, పేరుకు మాత్రమే ఉంది. మదరసాలకు ఈ ప్రభుత్వం నుండి సాయం అందడం లేదు. దీనిపై మీరొచ్చాక ఏం చర్యలు తీసుకుంటారు.?

లోకేశ్ : పేదలు బాగా చదవాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రవేశపెట్టాయి. ప్రభుత్వాలు మారినా సంక్షేమాన్ని కుదించలేదు. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో నామ మాత్రంగా అందిస్తున్నారు. ఫీజుల విధానంలో పాత విధానాన్ని తీసుకొస్తాం. బాగా చదివే విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి లేకుండా చేస్తాం. మదరసాలకు సాయంపై పార్టీ పెద్దలతో చర్చించి ప్రకటిస్తాం.

ప్రశ్న : వక్ఫ్ బోర్డుకు 64 వేల ఎకరాల ఆస్తులు ఉన్నాయి. 87 శాతం కబ్జా అయ్యాయి. ఈ సమస్యను మీరు ఏ విధంగా పరిష్కరించగలరు?

లోకేశ్ : పూర్వికులు మైనారిటీల సంక్షేమం కోసం భూములు ఇచ్చారు. వాటి రక్షణకు ఎన్టీఆర్ వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా జీవో తెచ్చి కలెక్టర్, ఎస్పీ, సీనియర్ అధికారులను నియమించి కబ్జాలపై చర్యలు తీసుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం పార్టీ కార్యకర్తలను వక్ఫ్ బోర్డులో నియమించుకున్నారు.

 వక్ఫ్ భూముల కబ్జాలపై ఆధారాలతో మాట్లాడాలని వైసీపీ నేతలు అంటున్నారు. కర్నూలులో 209/1 సర్వే పరిధిలో 1.5 ఎకరాలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కబ్జా చేశారు. ఈ భూమి నుండి ఖాళీ చేయాలని కోర్టు కూడా చెప్పింది. దిన్నెదేవరపాడులో సర్వే నంబర్ 19లో రూ.600 కోట్లు విలువ చేసే కొట్టాల మసీదుకు చెందిన 59.19 ఎకరాల భూమిలో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు వెంచర్లు వేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ అధికారాలు ఇస్తాం. 

ప్రశ్న: హిజాబ్ పై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి.?

లోకేశ్ : హిజాబ్ పై టీడీపీ క్లారీటీగా ఉంది... అందరి మత విశ్వాసాలను టీడీపీ గౌరవిస్తుంది. హిజాబ్ అనేది ముస్లింల సెంటిమెంట్ కు సంబంధించిన అంశం. వారి మనోభావాలను మేం గౌరవిస్తాం.

సలీం: ఉర్దూ పాఠశాలల్లో టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం మెగా డీఎస్సీతో భర్తీ చేస్తామన్నా కానీ చేయలేదు... మీరు వచ్చాక భర్తీ చేస్తారా.?

లోకేశ్ : 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక 1,200 ఉర్దూ పోస్టులను భర్తీ చేశాం. అందరికీ ముద్దులు పెట్టాడు... న్యాయం చేస్తాడని మీరు జగన్ ను  తెచ్చుకున్నారు. విలీనం పేరుతో స్కూళ్లను మూసేస్తున్నాడు. టీచర్ పోస్టులు ఖాళీ లేవని చెప్తున్నారు. విద్యను పేదలకు దగ్గర చేసి, ప్రత్యేక డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం.

ప్రశ్న : వచ్చే ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందా.?

లోకేశ్ : 2014లో బీజేపీ, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ ఏనాడైనా ఒక్క మైనారిటీ సోదరుడిపై అయినా దాడి జరిగిందా...? వేధింపులతో ఆత్మహత్యలు చేసుకున్నారా...? దుల్హన్, తోఫా, మసీదులకు రంగులు వేసుకునేందుకు డబ్బులు కూడా బీజేపీతో కలిసి ఉన్నప్పుడే ఇచ్చాం. ఇమాం, మౌజామ్ లకు జీతాలు ఇచ్చాం. రాజకీయ పొత్తులకు సంబంధం లేకుండా మైనారిటీలకు గతంలో ఏవిధంగా సంక్షేమాన్ని అందించామో అదేవిధంగా అందిస్తాం.

ప్రశ్న : మీకు బిర్యానీ అంటే ఇష్టమా..మీరు ఎప్పుడైనా వండారా.?

లోకేశ్ : నేను కొంత లావు అయింది కూడా బిర్యానీతోనే. హలీం అంటే నాకు ఇష్టం. వాటిని నేను ఎందుకు దూరం పెడతాను.?

ప్రశ్న : మైనారిటీ కార్పొరేషన్ ను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇస్లామిక్ బ్యాంక్ గురించి మీరు ఏం చెప్తారు.?

లోకేశ్: దామాషా ప్రకారం ముస్లింలకు నిధులు కేటాయించి ఖర్చు చేస్తాం. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే మైనారిటీల కల ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి తీరుతాం.

షేక్ గులాబ్ షాబి: ముస్లింలలో మీకు ఏ ట్రెడిషన్ నచ్చుతుంది.?

లోకేశ్ : రంజాన్ మాసంలో మీకున్న పట్టుదల చాలా గొప్పది. నమాజ్ చేసే సమయం వస్తే అన్ని పనులు ఆపుకుని నమాజ్ చేస్తారు. క్రమశిక్షణ, పట్టుదల ఇస్లాం నేర్పించింది. మీ పట్టుదల, క్రమశిక్షణ ఇష్టం.

ప్రశ్న: హజ్ హౌస్ కడపలో నిర్మించారు. కట్టడం వరకే ఉంది... కార్యకలాపాలు ప్రారంభించలేదు. విజయవాడలోనూ నిర్మాణం తలపెట్టారు. హజ్ హౌస్ చూడాలంటే హైదరాబాద్ వెళ్లాలా?

లోకేశ్: హైదరాబాద్ లో హజ్ హౌస్, హజ్ టెర్మినల్ నిర్మించింది చంద్రబాబే. ఏపీలోనూ రూ.25 కోట్లతో కడపలో హజ్ హౌస్ నిర్మాణం చేపట్టాం. అధికారంలోకి వచ్చాక హజ్ యాత్రకు విజయవాడ నుండి విమాన సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తాం.

రెహీనా : మీ వైఫ్ తో తాజ్ మహాల్ చూడటానికి వెళ్లారా...? తాజ్ మహాల్ ను గిఫ్ట్ గా మీ భార్యకు ఇచ్చారా...?

లోకేశ్: తాజ్ మహాల్ చూడటానికి వెళ్లా. అయితే బ్రాహ్మణితో వెళ్లలేదు. పాదయాత్ర పూర్తయ్యాక బ్రాహ్మణితో కలిసి వెళతా...గిఫ్ట్ కూడా ఇస్తా.

మహ్మద్ తన్వీ : మేము మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాం. డిస్టెన్స్ లో చదువుతున్నా. కానీ దాన్ని కూడా చదవలేని వాళ్లు చాలా మంది ఉన్నారు. మైనారిటీ విద్యార్థులకు డిస్టెన్స్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ విధానం తీసుకువస్తే బాగుంటుంది. అందరూ చదువుకుంటే కర్నూలు సిటీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేయాలన్న ఆశ ఉంది.

లోకేశ్: ఐటీ వ్యవస్థలో కొత్తకొత్త టెక్నాలజీ వస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ పెట్టి నిధులు కేటాయించి, ట్రైనింగ్ ఇచ్చాం. డిస్టెన్స్ లో చదవేవాళ్లకూ ఫీజు రీయింబర్స్ విధానం పరిశీలిస్తాం. 

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం – 1169.7 కి.మీ.*

*93వ రోజు (8-5-2023) యువగళం వివరాలు:*

*కర్నూలు అసెంబ్లీ నియోజక వర్గం*

ఉదయం

7.00 – కర్నూలు ఎస్ టిబిసి గ్రౌండ్ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

7.10 – ఇన్ కంటాక్స్ ఆఫీసు సర్కిల్ లో ఎస్సీలతో సమావేశం.

7.25 – మున్సిపల్ ఆఫీసు వద్ద స్థానికులతో మాటామంతీ.

7.40 – శ్రీలక్ష్మి స్కూలు జంక్షన్ లో లింగాయత్, టిడ్కో బాధితులతో సమావేశం.

7.50 – కొత్తపేట కమ్యూనిటీ హాలు వద్ద స్థానికులతో మాటామంతీ.

8.00 – జిల్లా కోర్టు వద్ద స్థానికులతో మాటామంతీ.

8.20 – కొండారెడ్డి బురుజు వద్ద ఎలక్ట్రికల్ వర్కర్లతో సమావేశం.

8.30 – అంబేద్కర్ సర్కిల్లో స్థానికులతో మాటామంతీ.

8.45 – పెద్దమార్కెట్ లో స్థానికులతో మాటామంతీ.

9.05 – చౌక్ లో రోజువారీ కార్మికులతో సమావేశం.

9.15 – చిన్నమ్మవారిశాలలో వైశ్యులతో ముఖాముఖి.

10.05 – మండీబజార్ లో స్థానికులతో మాటామంతీ.

10.15 – కుబూసూరత్ మసీదు వద్ద స్థానికులతో మాటామంతీ.

10.40 – దర్వేష్ ఖాద్రి దర్గా వద్ద వడ్డెర్లతో సమావేశం.

11.00 – ఉస్మానియా కాలేజి గ్రౌండ్ లో భోజన విరామం.

సాయంత్రం

4.00 – ఉస్మానియా కాలేజి గ్రౌండ్ నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.05 – ఉమర్ అరబిక్ స్కూలు వద్ద స్థానికులతో మాటామంతీ.

4.15 – బుధవారపుపేట వద్ద స్థానికులతో సమావేశం.

4.30 – వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద మహిళలతో సమావేశం.

4.40 – కాళికామాత టెంపుల్ వద్ద స్థానికులతో మాటామంతీ.

4.50 – కుమ్మరిగేటు 4వరోడ్డులో యాదవులతో సమావేశం.

5.00 – నైమిషాంబ గుడి వద్ద స్థానికులతో మాటామంతీ.

5.15 – షంషా మదర్సా వద్ద స్థానికులతో మాటామంతీ.

5.25 – జోహార్ పురం బ్రిడ్జి వద్ద స్థానికులతో మాటామంతీ.

5.50 – జోహార్ పురం చర్చి వద్ద బిసిలతో సమావేశం.

7.30 – పుల్లయ్య కాలేజి వద్ద విడిది కేంద్రంలో బస.

*******

  • Loading...

More Telugu News