Chandrababu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ

Former MLC Viswa Prasad joins TDP

  • టీడీపీలో చేరికలు
  • హైదరాబాదులో కార్యక్రమం
  • టీడీపీ తీర్థం పుచ్చుకున్న పీరుకట్ల విశ్వప్రసాద్, ఆయన సోదరుడు
  • పీరుకట్ల సోదరులకు సాదర స్వాగతం పలికిన చంద్రబాబు
  • కూన రవికుమార్ ఆధ్వర్యంలో చేరికలు

మరి కొన్ని నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, టీడీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఇవాళ పలువురు నేతలు పార్టీలోకి వచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, ఆయన సోదరుడు పీరుకట్ల ప్రభాకర్ రావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. 

టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి కూన రవికుమార్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. పీరుకట్ల సోదరులతో పాటు వారి సహచరులు కూడా టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది.

Chandrababu
TDP
Peerukatla Viswa Prasad
Prabhakar Rao
Amudala Valasa
Srikakulam District
Andhra Pradesh
  • Loading...

More Telugu News