NEET: దేశవ్యాప్తంగా ముగిసిన 'నీట్' పరీక్ష

NEET exam completed

  • జాతీయస్థాయి వైద్య విద్యా కోర్సుల కోసం నీట్
  • నేడు 499 నగరాలు/పట్టణాల్లో అర్హత పరీక్ష
  • హాజరైన 18.72 లక్షల మంది విద్యార్థులు
  • తెలంగాణ నుంచి 70 వేల మంది హాజరు
  • ఏపీ నుంచి 68 వేల మంది హాజరు

జాతీయస్థాయిలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నేడు నీట్ పరీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన నీట్ పరీక్ష సాయంత్రం 5.20 గంటలకు ముగిసింది. దేశవ్యాప్తంగా ఈ అర్హత పరీక్షకు 18.72 లక్షల మంది హాజరయ్యారు. 499 నగరాలు/పట్టణాలతో సహా, విదేశాల్లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

ఏపీ నుంచి 68,022 మంది నీట్ పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణ నుంచి 70 వేల మంది హాజరయ్యారు. 

పరీక్ష హాల్లోకి ప్రవేశించే ముందు విద్యార్థులను నిశితంగా తనిఖీలు చేశారు. చెవి కమ్మలు, ముక్కు పుడకలు, ఇతర ఆభరణాలు, ఉంగరాలు ధరించేందుకు అనుమతించలేదు. లోహంతో తయారైన ఎలాంటి వస్తువులను అధికారులు అనుమతించలేదు. 

కాగా, మణిపూర్ లో హింసాత్మక వాతావరణం నెలకొని ఉండడంతో అక్కడ నీట్ నిర్వహించలేదు. అయితే, నీట్ అభ్యర్థులు పరీక్ష సమయానికి వచ్చి రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు. వారికి మరో రోజు నీట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

NEET
Exam
Medicine
Courses
India
  • Loading...

More Telugu News