Navadeep: నా వలన ఆ హీరోయిన్ సూసైడ్ చేసుకుందనేది అబద్ధం: హీరో నవదీప్

Newsense WebSeries trailer release event

  • నవదీప్ హీరోగా రూపొందిన 'న్యూసెన్స్' వెబ్ సిరీస్ 
  • జర్నలిజం నేపథ్యంలో సాగే కథ 
  • ఈ నెల 12 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్  
  • తనపై గతంలో వచ్చిన వార్తల్లో నిజం లేదన్న నవదీప్

నవదీప్ - బిందుమాధవి నటించిన 'న్యూసెన్స్' వెబ్ సిరీస్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించారు. ఈ నెల 12వ తేదీన ఈ వెబ్ సిరీస్ 'ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. శ్రీప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్, కొంతసేపటి క్రితం హైదరాబాద్ లోని ఆర్కే సినీ ప్లెక్స్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను జరుపుకుంది. 
 
'మదనపల్లి'లో కొంతకాలం క్రితం జరిగిన ఒక సంఘటనతో .. జర్నలిస్టులకు సంబంధించిన నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అందువలన గతంలో నవదీప్ పై వచ్చిన కొన్ని వార్తలను గురించి ఈ వేదికపై నవదీప్ ను యాంకర్ ప్రశ్నించింది. '2005లో ఒక హీరోయిన్ మీ వలన సూసైడ్ చేసుకుందనే వార్తలు వచ్చాయి .. నిజమేనా?' అంటూ అడిగింది. అది అబద్ధమని నవదీప్ సమాధానమిచ్చాడు. 

ఇక నవదీప్ 'గే' అంటూ గతంలో వచ్చిన ఒక వార్తను గురించి యాంకర్ ప్రస్తావించింది. అది కూడా అబద్ధమని నవదీప్ చెప్పాడు. గతంలో ఒక రేవ్ పార్టీని నవదీప్ ఏర్పాటు చేసినట్టుగా వచ్చిన వార్తను గురించి యాంకర్ అడిగింది. ఆ వార్తలో ఎంతమాత్రం నిజం లేదనీ, అందుకు సాక్ష్యం తన తల్లి అని ఆయన సమాధానమిచ్చాడు. వయసును బట్టి చిన్న చిన్న అల్లరి పనులుచేయడం మాత్రం నిజమేనంటూ నవ్వేశాడు.

More Telugu News