Tollywood: చీరకట్టులో ‘ఆర్ట్​ ఆఫ్​ ఐ కాంటాక్ట్’ ఇలా అంటున్న డీజే టిల్లు నేహా శెట్టి

Neha Shetty new photo shoot

  • మెహబూబా సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నేహా
  • డీజే టిల్లుతో తెలుగులో మంచి ఫాలోయింగ్ 
  • కార్తికేయ సరసన బెదురులంకలో నటిస్తున్న యువ నటి

పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ సరసన మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి నేహా శెట్టి. ఈ సినిమా నిరాశ పరిచినా నేహాకు టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో నటించిన ఆమెకు ‘డీటే టిల్లు’ సినిమాతో మంచి బ్రేక్ లభించింది. సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న రాధిక పాత్రతో నేహా అందరినీ ఆకట్టుకుంది. అందంతోపాటు తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. 

ఈ సినిమా తర్వాత ఆమె కెరీర్ గ్రాఫ్ మారుతుందని అనుకున్నారు. కానీ, కార్తికేయ సరసన బెదురులంక చిత్రం తప్ప ఆమె చేతిలో మరో ప్రాజెక్టు లేదు. తన సినిమా కెరీర్ ఎలా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా ఆమె ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. తాజాగా చీర కట్టుకొని పాల్గొన్న తన లేటెస్ట్ ఫొటో షూట్ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసింది. ‘ఆర్ట్ ఆఫ్ ఐ కాంటాక్ట్’ అని ట్యాగ్ లైన్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన కళ్లతో కట్టిపడేస్తోంది.

Tollywood
neha shetty
DJ Tilllu
photo shoot

More Telugu News