Bus accident: నల్లమల ఘాట్ రోడ్ లో బస్సు బోల్తా
- పదిమందికి గాయాలు.. ఆసుపత్రికి తరలించిన పోలీసులు
- ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు
- ఘాట్ రోడ్ లో ప్రమాదం జరగడంతో రెస్క్యూ పనులకు ఆలస్యం
నల్లమల ఘాట్ రోడ్డులో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సు ఒకటి బోల్తా పడింది. దీంతో అందులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సుమారు పదిమంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో గాయపడ్డట్లు తెలుస్తోంది. పలువురికి కాళ్లు, చేతులు విరిగిపోయినట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని శ్రీశైలం, సున్నిపెంట ఆసుపత్రులకు తరలించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సండ్రుగుండ ప్రాంతానికి చెందిన భక్తులు బస్సులో శ్రీశైలం దర్శనానికి వెళ్లారు. నల్లమల ఘాట్ రోడ్ లో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో ఇరవై మంది ప్రయాణికులు ఉన్నారని తెలిసింది. ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తుండగా బస్సు అదుపుతప్పి బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో పదిమంది ప్రయాణికులకు గాయాలయ్యాయని, అందులో కొందరి చేతులు, కాళ్లు విరిగాయని తెలిపారు. ఘాట్రోడ్డులో ప్రమాదం జరగడంతో సహాయక చర్యలు చేపట్టడంలో ఆలస్యం జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.