Madhavi Latha: సోషల్ మీడియాలో సందడి చేస్తున్న మాధవీలత కాలేజి ఐడీ కార్డు

Madhavilatha ID Card went viral

  • ఇటీవల సమంత టెన్త్ క్లాస్ రిపోర్ట్ కార్డ్ వైరల్
  • తాజాగా ఎల్ఎల్ బీ ఐడీ కార్డు పంచుకున్న మాధవీలత
  • కర్ణాటకలోని బళ్లారిలో లా చదవిన మాధవీలత
  • తవ్వకాల్లో బయటపడిందంటూ ఐడీ కార్డుపై మాధవీలత చమత్కారం

సోషల్ మీడియాలో సినీ తారల పర్సనల్ విషయాలు వారి సినిమాల కంటే ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. ఇటీవల సమంత పదో తరగతి రిపోర్టు కార్డు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే వరుసలో నటి మాధవీలత కాలేజి ఐడీ కార్డు నెట్టింట సందడి చేస్తోంది. మాధవీలత కర్ణాటకలోని బళ్లారిలో వుంకి సన్నరుద్రప్ప (వీఎస్సార్) లా కాలేజీలో విద్యాభ్యాసం చేసినప్పటి ఐడీ కార్డు అది. 

ఈ ఐడీ కార్డును మాధవీలత స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. తవ్వకాల్లో బయటపడిందంటూ ఆమె చమత్కరించింది. బళ్లారిలోని వీఎస్సార్ కాలేజిలో ఎల్ఎల్ బీ చదివానని, ఇలాంటివి చూస్తుంటే అబ్బో జీవితంలో మనం చాలా చేశాం అనిపిస్తుంటుందని మాధవీలత పేర్కొంది.

Madhavi Latha
ID Card
LLB
Ballary
Karnataka
  • Loading...

More Telugu News