Naga Chaitanya: సోషల్ మీడియా వల్లే సమంతకు, నాకు మధ్య ఈ పరిస్థితులు!: నాగచైతన్య

Naga Chaitanya on Samanth divorce issue

  • సమంత మంచి మనసు ఉన్న వ్యక్తి, ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్న చైతూ
  • చట్ట ప్రకారం విడాకులు తీసుకొని ఏడాది అవుతోందని వ్యాఖ్య
  • తన గతంతో సంబంధం లేని మూడో వ్యక్తిని లాగారంటూ ఆవేదన

సినీ నటి సమంత మంచి మనసు ఉన్న వ్యక్తి అని, ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు నటుడు నాగచైతన్య. తాము విడిపోయి రెండేళ్లవుతోందని, చట్ట ప్రకారం విడాకులు తీసుకొని ఏడాది గడుస్తోందన్నారు. న్యాయస్థానం తమకు విడాకులను మంజూరు చేసిందని, ప్రస్తుతం తామిద్దరం ఎవరి జీవితాల్లో వారు ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. తన కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సమంత గురించి స్పందించారు.

సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల వల్లే మా మధ్య ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయన్నారు. తామిద్దరి మధ్య ఒకరిపై మరొకరికి గౌరవం లేనట్లుగా ప్రజల్లోకి వెళ్లిందన్నారు. అది తనను ఎంతగానో బాధపెట్టిందన్నారు. ఈ వ్యవహారంలో మరో దారుణమైన అంశం ఏమంటే తన గతంతో సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగారని, దీంతో ఆ మూడో వ్యక్తిని అగౌరవపరిచినట్లు అయిందన్నారు. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు తన వ్యక్తిగత జీవితంపై పలువురు తనను ప్రశ్నిస్తుంటారని, మొదట వాటిని పట్టించుకోనప్పటికీ, పదేపదే తన పెళ్లి గురించి ఎందుకు వదంతులు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

Naga Chaitanya
Samantha
  • Loading...

More Telugu News