Roja: పవన్ కల్యాణ్ మోయాల్సిన జెండా ఇక అదొక్కటి మిగిలుంది: రోజా వ్యంగ్యం

Roja satires on Pawan Kalyan

  • తిరుపతిలో వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాలు
  • ప్రారంభోత్సవం చేసిన మంత్రి రోజా
  • ఇక పవన్ మోయాల్సింది కేఏ పాల్ జెండా ఒక్కటే మిగిలుందని వెల్లడి
  • ఆ పని కూడా చేసేస్తే గిన్నిస్ బుక్ లోకి ఎక్కవచ్చని ఎద్దేవా

ఏపీ పర్యాటకం, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా తిరుపతిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేనాని పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీజేపీ జెండాలు మోయడమే పవన్ కల్యాణ్ పని అని విమర్శించారు. పవన్ కల్యాణ్ మోయాల్సిన జెండా ఒక్కటి మిగిలుందని వ్యంగ్యం ప్రదర్శించారు. కేఏ పాల్ పార్టీ జెండా కూడా పవన్ మోస్తే ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కవచ్చని ఎద్దేవా చేశారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. కల్యాణమస్తు మంజూరులో టెన్త్ క్లాసు చదువుతో పాటు అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు అని చెప్పడం ద్వారా సీఎం జగన్ పెద్ద మనసు స్పష్టమవుతోందని అన్నారు. వివాహం చేసుకున్న వారు తమ కాళ్లపై తాము నిలబడేలా ఈ కార్యక్రమం రూపొందించారని రోజా వివరించారు.

Roja
Pawan Kalyan
KA Paul
YSRCP
Janasena
Andhra Pradesh
  • Loading...

More Telugu News