Nagachaitanya: నిజం గెలవడానికి లేటవుతుంది .. కానీ కచ్చితంగా గెలుస్తుంది: 'కస్టడీ' ట్రైలర్ డైలాగ్

Custody trailer released

  • చైతూ హీరోగా రూపొందిన 'కస్టడీ'
  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న చైతూ 
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న ట్రైలర్ 
  • ఈ నెల 12న తెలుగు - తమిళ భాషల్లో రిలీజ్   

నాగచైతన్య హీరోగా శ్రీనివాస చిట్టూరి 'కస్టడీ' సినిమాను నిర్మించారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి అలరించనుంది. పోలీస్ ఆఫీసర్ గా చైతూ నటించిన ఈ సినిమాను, తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఓ సాధారణమైన పోలీస్ ఆఫీసర్ గా .. నిజాయతీ కలిగిన పోలీస్ ఆఫీసర్ గా ఉన్న చైతూకి ఎదురయ్యే సవాళ్లపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. 

'ఒకసారి న్యాయం వైపు నిలబడి చూడు నీ లైఫ్ మారిపోతుంది' .. 'నిజం గెలవడానికి లేటవుతుంది .. కానీ కచ్చితంగా గెలుస్తుంది' వంటి హీరో డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అరవింద్ స్వామి .. శరత్ కుమార్ .. ఆనంది ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.

Nagachaitanya
Krithi Shetty
Custody Movie
Venkat Prabhu

More Telugu News