KTR: ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్.. తొలి ఎంపీ టికెట్ ను ప్రకటించిన కేటీఆర్

KTR announces first MP ticket

  • కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ పేరును ప్రకటించిన కేటీఆర్
  • హుస్నాబాద్ సభలో కేటీఆర్ కీలక ప్రకటన
  • బండి సంజయ్ ను ఇంటికి పంపించాలని ఓటర్లకు విన్నపం

తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి పుంజుకుంటోంది. బీఆర్ఎస్ పార్టీ తమ తొలి అభ్యర్థి పేరును కూడా ప్రకటించింది. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ పేరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హుస్నాబాద్ లో నిర్వహించిన సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీపై, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఆయన విమర్శలు గుప్పించారు. నల్లధనం తెస్తామని చెప్పి తెల్లముఖం వేశారని విమర్శించారు. కరీంనగర్ ఎంపీ ఎవరని అడిగితే బండి సంజయ్ పేరు చెప్పాలంటే సిగ్గేస్తోందని అన్నారు. వినోద్ ను ఎంపీగా గెలిపించాలని.. బండి సంజయ్ ను ఇంటికి పంపించాలని అన్నారు.

KTR
BRS
Vinod
MP
Karimnagar
  • Loading...

More Telugu News