Jagan: ఎక్కువగా ప్రజలు వచ్చారని చూపేందుకు రోడ్లు క్రిక్కిరిసేలా చేస్తున్నారు: సీఎం జగన్

CM Jagan reviews on home ministry

  • ఏపీ హోంశాఖపై సీఎం జగన్ సమీక్ష
  • సభలకు తక్కువమంది వచ్చినా ఎక్కువగా చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు
  • జీవో నెం.1 సమర్థంగా అమలు చేయాలని ఆదేశాలు
  • రోడ్లపై సభలతో ప్రాణనష్టం జరిగే పరిస్థితులు రాకూడదని వెల్లడి

రాష్ట్ర హోంశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జీవో నెం.1ను సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు. రోడ్లపై సభలతో ప్రాణనష్టం జరిగే పరిస్థితులు రాకూడదని స్పష్టం చేశారు. ఎక్కువగా ప్రజలు వచ్చారని చూపేందుకు రోడ్లు క్రిక్కిరిసేలా చేస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు. తక్కువమంది వచ్చినా ఎక్కువగా చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల రెండు సభల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని సీఎం విచారం వ్యక్తం చేశారు. 

అటు, మహిళలపై సైబర్ వేధింపుల నివారణకు ఓ విభాగం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలు, చిన్నారులపై వేధింపుల కట్టడికి ప్రత్యేక విభాగం ఉండాలని అభిప్రాయపడ్డారు. దేశంలోనే అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Jagan
Home Ministry
Review
G.O.1
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News