NT Ramarao: ఎన్టీఆర్ ను దగ్గరగా చూశాను .. నాకు అర్థమైంది అదే: అశ్వనీదత్

Ashwanidutt Interview

  • ఎన్టీఆర్ తో సూపర్ హిట్లు తీసిన అశ్వనీదత్ 
  • ఆయన అనవసర విషయాలు మాట్లాడరని వెల్లడి
  • డబ్బు .. సమయం వృథా చేయరని వ్యాఖ్య 
  • ఎప్పుడూ ఏ హీరోను గురించి ఏమీ అనేవారు కాదన్న అశ్వనీదత్


టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా అశ్వనీదత్ కొనసాగుతున్నారు. ఎన్టీ రామారావుతో ఆయన సూపట్ హిట్ సినిమాలను నిర్మించారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్వనీదత్ మాట్లాడుతూ .. "రామారావుగారు సెట్లో సినిమాకి సంబంధించిన విషయాలను గురించి మాత్రమే ఆలోచన చేసేవారు. ఇతర హీరోలు ఎవరి గురించీ ఆయన మాట్లాడింది లేదు" అన్నారు. 

తన గురించి ఫలానా వారి దగ్గర ఫలానా వారు కామెంట్ చేశారని తెలిసినా పట్టించుకునేవారు కాదు. కొత్తవారికి అవకాశం ఇస్తే ప్రాజెక్టు దెబ్బతింటుందని ఎవరైనా భయపెడితే, జీవితం ఒడిదుడుకులతో వెళుతుంటేనే బాగుంటుంది.. అనేవారు. ఏ మాత్రం సమయం దొరికినా రామాయణ భారతాలను గురించే మాట్లాడేవారు" అని అన్నారు. 

"ఒకసారి ఒక ప్యాలెస్ ను హోటల్ గా మార్చిన మరుసటి రోజునే నేను ఆయనను తీసుకుని అక్కడికి వెళ్లాను. అంత ఖరీదైన హోటల్లో దిగడం అవసరమా అని అన్నారు. ప్రతి నిమిషం విలువైనదే అన్నట్టుగా ఆయన పనిచేసేవారు. డబ్బు .. సమయం ఈ రెండూ వృథా చేయకూడదని చెబుతుండేవారు. అక్కినేని కూడా అంతే క్రమశిక్షణతో నడచుకునేవారు" అని చెప్పుకొచ్చారు. 

NT Ramarao
Ashwanidutt
Tollywood
  • Loading...

More Telugu News