lifestyle: ఈ అలవాట్లతో ఆరోగ్య సమస్యలను ఆహ్వానించినట్టే..!

 lifestyle habits that are messing up your hormones

  • శరీరంలో ముఖ్యమైన పనుల నిర్వహణకు హార్మోన్ల పాత్ర కీలకం
  • వీటి మధ్య సమతుల్యత లోపించినప్పుడు పలు సమస్యలు
  • పొగతాగడం, ఒత్తిడి, మద్యపానం, నిద్రలేమితో సమస్యలు

మన శరీర జీవక్రియలు సాఫీగా సాగడంలో హార్మోన్ల పాత్ర ఎంతో విశిష్టమైనది. అంతటి ముఖ్యమైన హార్మోన్ల ఉత్పత్తిని కొన్ని జీవనశైలి అలవాట్లు ప్రభావితం చేస్తుంటాయి. దాంతో శారీరకంగా ఎన్నో మార్పులు కనిపిస్తాయి. హార్మోన్లలో అసమతుల్యం ఏర్పడితే అది ఎన్నో అనారోగ్యాలు, చర్మ సమస్యలకు దారితీస్తుంది. మన రక్తంలో చక్కెర స్థాయులు, రక్తపోటు, ఎదుగుదల, సంతానం, లైంగిక కోర్కెలు, జీవక్రియలు వీటిన్నింటినీ హార్మోన్లే నిర్ణయిస్తుంటాయి. 

చివరికి మన నిద్రకు కీలకంగా పనిచేసే మెలటోనిన్ అనే హార్మోన్ ను సైతం కొన్ని అలవాట్లు అస్తవ్యస్తం చేస్తాయి. చీకటిలోకి వెళ్లగానే మెలటోనిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాంతో నిద్ర వస్తుంది. తిరిగి వెలుగులోకి వస్తే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో మెలుకువ వస్తుంది. ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ మహిళల్లో పునరుత్పత్తి అవయవం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది లోపిస్తే సంతాన భాగ్యం కలగదు. పురుషుల్లో అయితే టెస్టోస్టెరాన్ ఈ పనులు చేస్తుంటుంది. శరీరంలో విడుదలయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ ఒత్తిడికి కారణమవుతుంది. ఈ హార్మోన్ వల్ల బరువు పెరగడం, ఆందోళన, గుండె జబ్బులు కూడా రావచ్చు.

ఆల్కహాల్
మద్యం సేవించే అలవాటు హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. అసాధారణ పాంక్రియాటిక్ పనితీరు, ఇన్సులిన్ నిరోధకత, ఆందోళనకు కారణమవుతాయి. టెస్టో స్టెరాన్, ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గుతుంది.

పొగతాగడం
పొగతాగడం వల్ల లంగ్ కేన్సర్ ముప్పు వస్తుందని తెలిసిందే. అలాగే, పొగతాగే అలవాటు ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. మహిళల్లో సంతాన సామర్థ్యం తగ్గుతుందని పలు అధ్యయనాలు సైతం వెల్లడించాయి. 

ఒత్తిడి
ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరంలో కార్టిసోల్ స్థాయులు పెరిగిపోతాయి. కార్టిసోల్ పెరిగిపోయినప్పుడు ఇతర హార్మోన్లు చురుగ్గా పని చేయవు. కార్టిసోల్ స్థాయి పెరిగితే ప్రొజెస్టెరోన్ విడుదల తగ్గుతుంది. దీంతో ఈస్ట్రోజెన్ ఆధిపత్యం పెరుగుతుంది. ఈ అసమతుల్యత మన మూడ్ (భావనలు) పై ప్రభావం చూపిస్తుంది. ప్రొజెస్టరాన్ సహజ యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది. ఇది తగ్గితే పునరుత్పత్తి అవకాశాలపైనా ప్రభావం చూపిస్తుంది.

తగినంత నిద్ర లేకపోవడం
మన శరీరం రీచార్జ్ చేసుకునేందుకు, రిపేర్ చేసుకునేందుకు నిద్ర ఎంతో ముఖ్యమైనది. తగినంత నిద్ర లేనప్పుడు శరరీంపై దాని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కొంచెం సమయానికే అలసట వచ్చేస్తుంది. 

కెఫైన్
కెఫైన్ ను పరిమితంగానే తీసుకోవాలి. ఇది ఎక్కువైనా హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. శరీరం ఎక్కువ కార్టిసోల్ విడుదల చేసేందుకు కెఫైన్ ప్రేరణనిస్తుంది.

  • Loading...

More Telugu News