Ileana DCruz: తల్లి కాబోతున్న ఇలియానా.. తండ్రి ఎవరో మరి?

 Mommy to be Ileana DCruz flaunts baby bump for the 1st time after announcing pregnancy

  • బేబీ బంప్ వీడియోను షేర్ చేసిన హీరోయిన
  • దేవదాసు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ
  • చాన్నాళ్లు తెలుగులో అగ్ర హీరోయిన్ గా ఉన్న ఇలియానా

పోతినేని రామ్ సరసన దేవదాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చి చాన్నాళ్ల పాటు అగ్ర హీరోయిన్ గా నిలిచిన నటి ఇలియానా. పలువురు స్టార్ హీరోలు, యువ నటుల సరసన నటించిన ఇలియానా.. మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో క్రమంగా అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ అనుకున్నంత సక్సెస్ రాకపోయినా.. కెరీర్ ను నెట్టుకొస్తోంది. ఇదిలాఉండగా తాను తల్లి కాబోతున్నానని చెబుతూ  ఇలియానా అందరికీ షాకిచ్చింది. తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆమె సోషల్ మీడియాలో తెలిపింది. రెండు వారాల కిందట చిన్నారి డ్రెస్సును, తన మెడలో మమా అని రాసి ఉన్న లాకెట్ ఫొటోలను షేర్ చేసింది. కానీ, చాలా మంది నమ్మలేదు.

అయితే, తొలిసారి బేబీ బంప్ తో ఉన్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిందామె. కాగా, ఇలియానాకు ఇంకా పెళ్లి కాలేదు. తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరన్నది ఇలియానా వెల్లడించలేదు. గతంలో ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసిన ఇలియానా 2019లో అతని నుంచి విడిపోయింది. నటి కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కత్రినా, విక్కీ తదితరులతో కలిసి మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లారు. అయితే, ఇలియానా తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఇంకా బహిర్గతం చేయలేదు.
.

More Telugu News