Allari Naresh: 'ఉగ్రం' సినిమాకి హైలైట్ గా నిలవనున్న ఫైట్స్!

Ugram movie update

  • అల్లరి నరేశ్ హీరోగా చేసిన 'ఉగ్రం'
  • విజయ్ కనకమేడలతో రెండో సినిమా 
  • ఫైట్స్ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్న నరేశ్ 
  • ఈ నెల 5వ తేదీన సినిమా విడుదల

అల్లరి నరేశ్ సినిమాల్లో కావలసినంత కామెడీ ఉంటుందని చెబితే ఎవరూ ఆశ్చర్యపోరు. కానీ ఆయన సినిమాలో భారీ ఫైట్లు ఉంటాయని చెబితే మాత్రం ఎవరైనా షాక్ అవుతారు. అలా ఆడియన్స్ కి షాక్ ఇవ్వడానికి 'ఉగ్రం' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ఆయన రెడీ అవుతున్నాడు. విజయ్ కనకమేడలతో ఆయన చేసిన రెండో సినిమా ఇది.  

అల్లరి నరేశ్ సిగరెట్ పెట్టెలు చుట్టుకుని సిక్స్ ప్యాక్ అంటే అంతా హాయిగా నవ్వుకున్నారు. ఆయన భయపడుతూనే ఫైట్లు చేస్తే కడుపుబ్బ నవ్వుకున్నారు. అలాంటి అల్లరి నరేశ్ ఒక్కసారిగా సీరియస్ గా మారిపోయి .. రౌడీ గ్యాంగ్ ను వరుసబెట్టి ఉతికేస్తుంటే, ఎవరైనా సరే నోరెళ్ల బెట్టవలసిందే. 

అలాంటి ఫైట్లు ఈ సినిమాలో ఉన్నాయని అల్లరి నరేశ్ ప్రతి ఇంటర్వ్యూలోను చెబుతూ వస్తున్నాడు. ఈ సినిమాలోని ఫైట్స్ ను డిఫరెంట్ గా డిజైన్ చేయడం జరిగిందని అన్నాడు. ప్రతి ఫైట్ ఎమోషన్స్ తో లింకై ఉంటుందని చెప్పాడు. కథాకథనాలతో పాటు ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెప్పుకొచ్చాడు. మరి ఆ ఫైట్స్ ఏ రేంజ్ లో ఉన్నాయనేది రేపు థియేటర్స్ లో చూడవలసిందే. 

Allari Naresh
Vijay Kanakamedala
Ugram Movie
  • Loading...

More Telugu News