Nagachaitanya: పక్కా మాస్ లుక్ తో అందాల నటుడు అరవింద్ స్వామి: 'కస్టడీ' పోస్టర్ రిలీజ్!

Custody Movie Update

  • చైతూ హీరోగా రూపొందిన 'కస్టడీ'
  • కథానాయికగా అలరించనున్న కృతి శెట్టి  
  • కీలమైన పాత్రలో అరవింద్ స్వామి
  • ఈ నెల 12వ తేదీన తెలుగు - తమిళ భాషల్లో రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరోలలో అందాల నటులు అనిపించుకున్నవారు ఇద్దరే ఇద్దరు. ఒకరు అజిత్ అయితే మరొకరు అరవింద్ స్వామి. అయితే హీరోగా అజిత్ మాస్ పాత్రలను ఎంచుకుంటూ, మాస్ ఆడియన్స్ నుంచి కూడా మంచి మార్కులు కొట్టేశారు. కానీ అరవింద్ స్వామి మాస్ పాత్రలను చేసినట్టుగా మాత్రం కనిపించదు. అలాంటి అరవింద్ స్వామి పక్కా మాస్ లుక్ తో కనిపించే సినిమానే 'కస్టడీ'. 

ఈ సినిమాలో 'రాజు' అనే పాత్రను అరవింద్ స్వామి పోషించారనీ, ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని నిన్న చైతూ చెప్పాడు. ఇప్పుడు అరవింద్ స్వామి మాస్ లుక్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ... నోట్లో బీడీతో .. రఫ్ లుక్ తో అరవింద్ స్వామి ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. 

నిజానికి ఈ తరహా పాత్రలో ఆయన కనిపించడం తెలుగు ఆడియన్స్ కి ఇదే మొదటిసారి కావొచ్చునేమో. అంతటి అందగాడిని ఇలాంటి పాత్రలో చూడటం కష్టంగానే అనిపించినా, ఆ పాత్రను వెంకట్ ప్రభు ఎలా కనెక్ట్ చేశాడనేది చూడాలి. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాకు, ఇళయరాజా - యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. మే 12వ తేదీన ఈ సినిమాను తెలుగు - తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

Nagachaitanya
Krithi Shetty
Aravinda Swami
Custody Movie
  • Loading...

More Telugu News