Lucknow Super Gaints: వర్షం కారణంగా లక్నో-చెన్నై మ్యాచ్ రద్దు.. ఐపీఎల్‌లో చాలా ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!

LSG vs CSK Match Called Off Due To Rain

  • లక్నో ఇన్నింగ్స్ 19.2 ఓవర్ల వద్ద ప్రారంభమైన వర్షం
  • ఎంతకీ తగ్గకపోవడంతో రద్దు చేస్తున్నట్టు ప్రకటన
  • ఇరు జట్లకు చెరో పాయింట్

లక్నో సూపర్ జెయింట్స్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ రద్దయింది. లక్నోలోని ఏక్నా క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైన మ్యాచ్.. లక్నో ఇన్నింగ్స్ మరో నాలుగు బంతుల్లో ముగుస్తుందనగా ఆగిపోయింది. జోరు వాన ప్రారంభం కావడం, ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. 

చెరో 11 పాయింట్లతో ఇరు జట్లు సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్ కారణంగా లక్నో రెండో స్థానంలో, చెన్నై మూడో స్థానంలో నిలిచాయి. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే సమయానికి లక్నో 7 వికెట్ల నస్టానికి 125 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో వాతావరణం సరిగా లేకపోవడం వల్ల మ్యాచ్ ఆగిపోవడం చాలా సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి.

Lucknow Super Gaints
Chennai Super Kings
IPL 2023

More Telugu News