MalliPelli: నరేశ్​, పవిత్ర ‘మళ్లీ పెళ్లి’ డేట్ ఫిక్స్​!

MalliPelli Releasing in Worldwide Theaters On May 26th

  • మే 26న నూతన చిత్రం విడుదల
  • తన నిజ జీవితాన్నే తెరపై చూపించనున్న నరేశ్
  • దర్శకత్వం వహిస్తున్న ఎంఎస్ రాజు

రియల్ లైఫ్ లో పెళ్లి బంధంతో ఒక్కటి కావాలని అనుకుంటున్న సీనియర్ నటులు నరేశ్, పవిత్ర లోకేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్ళీ పెళ్లి'. నరేశ్  నిజ జీవిత కథతో  ఎంఎస్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  నరేష్ నిర్మాతగా వ్యహరిస్తున్న ఈ సినిమాలో నరేశ్ రియల్ లైఫ్, ఆయన గత పెళ్లిళ్ల చుట్టూ తిరుగుతుందని టీజర్ ద్వారా తెలిసింది. 'మళ్ళీ పెళ్లి' చిత్రాన్ని మే 26న విడుదల చేస్తున్నట్టు నరేశ్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 

ప్రస్తుతం నరేశ్,  నటి పవిత్ర లోకేశ్ సహజీవనం చేస్తున్నారని సమాచారం. ఆమెని పెళ్లి కూడా చేసుకోవాలని నరేశ్ భావిస్తున్నప్పటికీ.. తన మూడో భార్య రమ్య రఘుపతితో విడాకుల కేసు ఇంకా తేలకపోవడంతో ముందడుగు వేయలేకపోతున్నారు. ఈ లోపు తన నిజజీవితాన్నే ఆయన తెరపై చూపే ప్రయత్నం చేస్తున్నారు. రమ్యా రఘుపతి పాత్రలో  వనిత విజయ్ కుమార్ నటించారు.

More Telugu News