Allari Naresh: ఆ సినిమా మాత్రం చాలా టెన్షన్ పెట్టేసింది: అల్లరి నరేశ్

Allari Naresh Interview

  • అల్లరి నరేశ్ తాజా చిత్రంగా 'ఉగ్రం'
  • ఈ నెల 5న విడుదలవుతున్న సినిమా
  • 'నాంది' విషయంలో టెన్షన్ పడ్డామన్న నరేశ్ 
  • 'ఉగ్రం' పై నమ్మకం ఉందని వెల్లడి  

హాస్య కథానాయకుడిగా అల్లరి నరేశ్ కి మంచి క్రేజ్ ఉంది. అలాంటి ఆయన రొటీన్ కి భిన్నంగా సీరియస్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. అలా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రావడానికి 'ఉగ్రం' రెడీ అవుతోంది. గతంలో అల్లరి నరేశ్ కి 'నాంది' సినిమాతో హిట్ ఇచ్చిన విజయ్ కనకమేడల, 'ఉగ్రం' సినిమాను ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. 

తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లరి నరేశ్ మాట్లాడుతూ .. 'ఉగ్రం' సినిమా విషయంలో నేను టెన్షన్ పడుతున్నానని అనుకుంటారు. కానీ నిజానికి నేను 'నాంది' సినిమా విషయంలో ఎక్కువ టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఆ సినిమాకి ముందు చేసిన కొన్ని కామెడీ సినిమాలు సరిగ్గా ఆడలేదు" అని అన్నారు. 

"నాకు బాగా అలవాటైన కామెడీ సినిమాలే సరిగ్గా ఆడనప్పుడు, 'నాంది'ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా అనిపించింది. కానీ ఈ విషయంలో విజయ్ కనకమేడల పూర్తి క్లారిటీతో ఉన్నాడు .. అలాగే సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఏ మాత్రం ఫన్ టోన్ లేని ఫైట్స్ 'ఉగ్రం' సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాము" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News