Sai Kalyani: కొడాలి నాని, వల్లభనేని వంశీలపై పోస్టులు.. టీడీపీ నాయకురాలు కల్యాణిపై కేసు నమోదు

Case booked on TDP leader Sai Kalyani

  • థాయ్ ల్యాండ్ లో అరెస్ట్ అయిన చికోటి ప్రవీణ్
  • ప్రవీణ్ తో కొడాలి, వల్లభనేనికి సంబంధాలు ఉన్నాయంటూ కల్యాణి పోస్టులు
  • కేసు నమోదు చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులు

కేసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ థాయ్ ల్యాండ్ లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో ఆయనతో పాటు చాలా మందిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. చికోటితో పాటు అరెస్ట్ అయిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. వీరందరికీ అక్కడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

ఇదిలావుంచితే, చికోటి అరెస్ట్ అయిన తరుణంలో టీడీపీ నాయకురాలు, తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి సాయి కల్యాణి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. చికోటి ప్రవీణ్ తో కొడాలి నానికి, వల్లభనేని వంశీకి సంబంధాలు ఉన్నాయని ఆమె కామెంట్ చేశారు. ఈ క్రమంలో ఆమెపై వైసీపీకి చెందిన ప్రదీప్ అనే కార్యకర్త హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

Sai Kalyani
Telugudesam
Chikoti Praveen
Kodali Nani
Vallabhaneni Vamsi
YSRCP
  • Loading...

More Telugu News