Teja: నేను ఎవరి దగ్గరికీ వెళ్లి నాతో సినిమా చేయమని అడగను: డైరెక్టర్ తేజ

Teja Interview

  • ప్రేమకథా చిత్రాలకు తేజ పెట్టింది పేరు 
  • ఎవరైనా సక్సెస్ వెనుకే ఉంటారని వ్యాఖ్య 
  • అది రామానాయుడిగారికే చెల్లిందని వెల్లడి

డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. సినిమాకి .. సినిమాకి మధ్య ఆయన చాలా గ్యాప్ తీసుకుంటూ ఉంటారు. ప్రేమకథా చిత్రాలపై తనదైన ప్రత్యేకమైన మార్కు కనిపిస్తూ ఉంటుంది. తాజాగా గోపీచంద్ ను ఇంటర్వ్యూ చేస్తున్న ఆయన, తన పద్ధతిని గురించి కూడా ఈ సందర్భంలో ప్రస్తావించారు.

"నా నుంచి సినిమాలు వెంటవెంటనే రాకపోవడానికి కారణం ఉంది. ఎందుకంటే నేను ఏ నిర్మాతను గానీ .. హీరోను గాని కలవను, నాతో సినిమా చేయమని అడగను. ఇక్కడ హీరోలంతా సక్సెస్ ను బట్టే ముందుకు వెళతారు. తమతో సినిమా చేసే నిర్మాత .. దర్శకుడు సక్సెస్ లతో ఉన్నారా లేదా అనేది చూస్తారు. సక్సెస్ ఉంటేనే సినిమా చేయడానికి మొగ్గుచూపుతారు" అని అన్నారు. 

"ఇక్కడ టాలెంట్ ఉన్నవారిని గుర్తించి అవకాశం ఇచ్చేవారు తక్కువ. ఒకప్పుడు కేఎస్ ప్రకాశ్ రావుగారు వరుస ఫ్లాపులతో ఉన్నప్పుడు, ఆయన టాలెంట్ పై నమ్మకంతో 'ప్రేమ్ నగర్' సినిమాతో రామానాయుడు గారు ఛాన్స్ ఇచ్చారు. అలాంటివారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అంటూ చెప్పుకొచ్చారు. 

Teja
Gopichand
Tollywood
  • Loading...

More Telugu News