Hero vikram: ‘తంగలాన్’ రిహార్సల్స్ లో గాయపడ్డ చియాన్ విక్రమ్

Actor Vikram Suffers Rib Injury

  • హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన సిబ్బంది
  • పక్కటెముక విరిగినట్లు గుర్తించిన వైద్యులు
  • ఆపరేషన్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడి

తమిళ హీరో చియాన్ విక్రమ్ ప్రమాదానికి గురయ్యారు. తన కొత్త సినిమా ‘తంగలాన్’ షూటింగ్ రిహార్సల్స్ లో విక్రమ్ ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. విక్రమ్ ను పరీక్షించిన డాక్టర్లు.. ఆయన పక్కటెముక ఒకటి విరిగిందని వెల్లడించారు. ఆపరేషన్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. విక్రమ్ కోలుకోవడానికి సమయం పడుతుందని అన్నారు. కాగా, డైరెక్టర్ పా రంజిత్ ఆధ్వర్యంలో విక్రమ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా తంగలాన్.. ఇందులో హీరోయిన్లుగా మాళవిక మోహన్, పార్వతి తిరువోతు నటిస్తున్నారు. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో తంగలాన్ సినిమా చిత్రీకరణకు విక్రమ్ కొంతకాలంగా దూరంగా ఉన్నారు. తాజాగా తంగలాన్ సినిమా షూటింగ్ రిహార్సల్ సెషన్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా రిహార్సల్ సెషన్ జరుగుతోంది.

Hero vikram
Chian vikram
Thangalaan
shooting
vikram injured
  • Loading...

More Telugu News