Jabardsth Mahesh: నాన్న అంత్యక్రియలకు నా దగ్గర ఒక్క పైసా లేదు: కన్నీళ్లు పెట్టుకున్న 'జబర్దస్త్' మహేశ్

Jabardasth Mahesh Interview

  • 'జబర్డస్త్'తో పేరు తెచ్చుకున్న మహేశ్ 
  • 'రంగస్థలం'తో మంచి గుర్తింపు 
  • ఆర్థికపరమైన కష్టాలను గురించిన ప్రస్తావన 
  • తండ్రిని తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్న మహేశ్ 

'జబర్దస్త్' మహేశ్ .. అనగానే సన్నగా .. పొడుగ్గా ఉన్న ఒక కుర్రాడు చేసే కామెడీ గుర్తొస్తుంది. తనదైన స్లాంగ్ .. డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ చాలామందికి నచ్చుతుంది. ఆ తరువాత అతను సినిమాలో చిన్నచిన్న పాత్రలను చేస్తూ ఒక్కో మెట్టూ ఎదుగుతూ వెళుతున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్యమైన రోల్స్ చేస్తున్నాడు. 

తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ మాట్లాడుతూ .. "సినిమాలనే నమ్ముకున్నాను .. జీరోతో నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నేను సినిమాలలో ట్రై చేస్తున్నప్పుడే మా ఫాదర్ చనిపోయాడు. ఆయన అంత్యక్రియలకు కూడా నా దగ్గర ఒక్క పైసా లేదు. దాంతో సినిమాలు అవసరమా? అంటూ మా బంధువులంతా నన్ను తిట్టారు. అప్పుడు మాత్రం నేను చాలా బాధపడ్డాను" అని అన్నాడు. 

" ఆ తరువాత హైదరాబాద్ వచ్చిన నన్ను 'జబర్డస్త్'కి షకలక శంకర్ పరిచయం చేశాడు. 2011 నుంచి సుకుమార్ గారి చుట్టూ తిరిగితే, 2017లో ఆయన 'రంగస్థలం' సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చారు. ఆ పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇంతకుముందు మాకు సొంత ఇల్లు కూడా లేదు. అందువలన ఈ మధ్యనే అక్కడ ఇల్లు కట్టాను" అని చెప్పుకొచ్చాడు.

Jabardsth Mahesh
Actor
Tollywood
  • Loading...

More Telugu News