Charan: చరణ్ నో చెబితేనే అఖిల్ దగ్గరికి వెళ్లిన 'ఏజెంట్'?

Charan Special

  • అఖిల్ హీరోగా చేసిన 'ఏజెంట్'
  • రిలీజ్ రోజునే నిరాశపరిచిన ఫలితం
  • ముందుగా ఈ కథ చరణ్ దగ్గరికి వెళ్లిందని టాక్ 
  • ఆయనకి ఫ్లాప్ తప్పిందంటూ ప్రచారం

సాధారణంగా ఒక హీరో వదులుకున్న కథ .. మరో హీరో దగ్గరికి వెళుతూనే ఉంటుంది. అలాగే ఒక హీరోకి నచ్చని కథ .. మరో హీరోకి బాగా నచ్చుతూ ఉంటుంది. అలా వదులుకున్న కథ అవతల హీరోకి హిట్ ఇస్తే అయ్యో అనుకోవడం .. ఫ్లాప్ అయితే హమ్మయ్య అనుకోవడం అభిమానుల వైపు నుంచి వినిపిస్తూ ఉంటుంది.

ఇక ఇప్పుడు అఖిల్ కి ఫ్లాప్ ఇచ్చిన 'ఏజెంట్' కథ ముందుగా చరణ్ వినడం జరిగిందనే టాక్ తెరపైకి వచ్చింది. సురేందర్ రెడ్డికి .. చరణ్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందువల్లనే చరణ్ ఆయనతో 'ధ్రువ' చేశాడు .. 'సైరా' చేయడానికి అవకాశం ఇచ్చాడు. చరణ్ తో ఉన్న స్నేహం కారణంగానే ఆయనతో సురేందర్ రెడ్డి 'ఏజెంట్' సినిమాను చేయాలనుకున్నాడట. 

అయితే ఆ సమయంలో చరణ్ ఇటు 'ఆర్ ఆర్ ఆర్' .. అటు 'ఆచార్య సినిమాలతో బిజీగా ఉండటం, అప్పటికే శంకర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వలన కుదరదని చెప్పాడట. అందువల్లనే ఆ కథను పట్టుకుని అఖిల్ దగ్గరికి సురేందర్ రెడ్డి వెళ్లాడని చెబుతున్నారు. సురేందర్ రెడ్డిపై గల నమ్మకంతో నాగ్ ఓకే చెప్పారు. ఇక ఆ తరువాత సంగతి తెలిసిందే. 

Charan
Surendar Reddy
Akhil
Agent Movie
  • Loading...

More Telugu News