TSRTC: బస్సులతో ఆటలా.. జాగ్రత్త: వైరల్ వీడియోపై సజ్జనార్ హెచ్చరిక

TSRTC MD VC Sajjanar warns biker who pose with RTC Bus

  • బస్సును వెనక నుంచి కాలితో నెడుతున్నట్టుగా బైకర్ పోజు
  • పిచ్చి పనులు చేస్తే బాగుండదని సజ్జనార్ హెచ్చరిక
  • పాప్యులారిటీ కోసం తల్లిదండ్రులకు శోకం మిగల్చొద్దని సూచన

స్కూటర్ పై వెళ్తూ హైదరాబాద్ సిటీ బస్సును వెనక నుంచి కాలితో నెడుతున్నట్టుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మిథానీ డిపోకు చెందిన బస్సు 104-రూట్‌లో ప్రయాణిస్తుండగా స్కూటర్‌పై వెళ్తున్న ఓ యువకుడు బస్సును కాలితో ముందుకు నెడుతున్నట్టుగా పోజిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

దీనికి స్పందించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో పాప్యులారిటీ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దన్నారు. నడిరోడ్డుపై ఇలాంటి ఫీట్లు చేసి ప్రమాదాలపాలై తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని సూచించారు. ఇలాంటి వారిపై చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించారు.

TSRTC
VC Sajjanar
Biker
Social Media
Viral Videos
Road Safety

More Telugu News