Vikram: 4 రోజుల్లో 'పొన్నియిన్ సెల్వన్ 2' ఎంత వసూలు చేసిందంటే..!

Ponniyin Selven 2 movie

  • ఈ నెల 28న విడుదలైన 'PS -2'
  • 4 రోజుల్లో 200 కోట్లకి పైగా వసూళ్లు 
  • ఫస్టు పార్టుకి కి మించిన ఆదరణ
  • మణిరత్నం మార్కుకి మరోసారి ప్రశంసలు

మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'పొన్నియిన్ సెల్వన్ 2' ఈ నెల 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నిన్నటితో ఈ సినిమా విడుదలై 4 రోజులు అయింది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమా 200 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ పోస్టర్ ను వదిలారు. 

'పొన్నియిన్ సెల్వన్' కథ అంతా కూడా తమిళనాడు ప్రాంతంలో జరుగుతుంది. మణిరత్నం చిత్రీకరణను .. లైకా వారి నిర్మాణ విలువలను వంకబెట్టడానికి లేదు. కానీ రాజ్యాలు .. రాజుల పేర్లు తమిళంలో ఉండటం .. పాత్రల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన ఫస్టు పార్టు ఇక్కడి ప్రేక్షకులకు ఎక్కడం కొంచెం కష్టమే అయింది.

అయితే ఫస్టు పార్టులోనే పాత్రల పరిచయాలు జరిగిపోవడం వలన, సెకండ్ పార్టుకి వచ్చేసరికి ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చింది. అంతేకాదు కీలకమైన సన్నివేశాలు పార్టు 2లో ఉండటం వలన కూడా ఆదరణ పెరిగింది. అన్ని ప్రాంతాలలోను ఫస్టు పార్టుకంటే సెకండ్ పార్టుకి ఎక్కువ రెస్పాన్స్ కనిపించడానికి ఇదే కారణం.

Vikram
Aishwarya Rai
Karthi
Trisha
Ponniyin Selvan 2
  • Loading...

More Telugu News