COVID19: దేశంలో మరింత దిగొచ్చిన కరోనా కొత్త కేసులు
- కొన్నివారాల కిందట మళ్లీ కరోనా కలకలం
- ఒక్కసారిగా 10 వేలకు పైగా రోజువారీ కేసులు
- కొన్నిరోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న కొత్త కేసులు
- పెరిగిన రికవరీ రేటు
కొన్నివారాల కిందట దేశంలో కరోనా రోజువారీ కేసులు 10 వేలు దాటడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దాంతో కేంద్రం కూడా అత్యవసర సమీక్షలు నిర్వహించి, మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే అందరికీ ఊరట కలిగిస్తూ కొన్నిరోజులుగా కరోనా రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో దేశంలో 3,325 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో 6,379 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 44,175 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించింది. కోలుకుంటున్న వారి శాతం 98.72గా ఉందని తెలిపింది.