Jagadish: 'ఆహా'లో 'సత్తిగాని రెండెకరాలు' .. కొత్త స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Sathigani Rendekaralu New Update

  • జగదీశ్ హీరోగా 'సత్తిగాని రెండెకరాలు'
  • 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి వస్తున్న సినిమా 
  • కీలకమైన పాత్రలో వెన్నెల కిశోర్ 
  • ఈ నెల 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్

'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి 'సత్తిగాని రెండెకరాలు' సినిమా రానుంది. ఇప్పటివరకూ భారీ సినిమాలను నిర్మిస్తూ వచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ వారు, ఓటీటీ సినిమాలను కూడా నిర్మించడానికి రంగంలోకి దిగారు. అలా వారు నిర్మించిన సినిమానే 'సత్తిగాని రెండెకరాలు'. 

'పుష్ప' సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడుతూ, బన్నీ స్నేహితుడిగా జగదీశ్ కనిపిస్తాడు. అతనే ఈ సినిమాలోని ప్రధానమైన పాత్రధారి అయిన 'సత్తి'. కథ ప్రకారం అతనికి భార్యాబిడ్డలు ఉంటారు. ఆటో నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్న ఆయన, ఒకానొక సమస్యలో చిక్కుకుంటాడు. 

ఆ సమస్య నుంచి బయటపడటానికి అతను తన పొలాన్ని అమ్మేయాలనుకుంటాడు. ఫలితంగా చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి అనేది కథ. అభినవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చిలోనే స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు .. కానీ వాయిదా వేసుకున్నారు. ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు కొంతసేపటి క్రితం అనౌన్స్ చేశారు.

More Telugu News