Bhuvana Vijayam: 'భువన విజయం' ట్రైలర్ ఇదిగో!

Bhuvana Vijayam trailer out now

  • సునీల్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్ నటించిన చిత్రం భువన విజయం
  • యలమంద చరణ్ దర్శకత్వం
  • మే 12న రిలీజవుతున్న భువన విజయం
  • నేడు ట్రైలర్ ను విడుదల చేసిన చిత్రబృందం

సునీల్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్ తదితరులు నటించిన చిత్రం భువన విజయం. హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా బ్యానర్లపై ఉదయ్ కిరణ్, శ్రీకాంత్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి యలమంద చరణ్ దర్శకత్వం వహించాడు. 

తాజాగా భువన విజయం చిత్రబృందం ట్రైలర్ ను విడుదల చేసింది. ట్రైలర్ చూస్తే ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టయినర్ అని అర్థమవుతుంది. పృథ్వీ, ధన్ రాజ్, వైవా హర్ష తదితరులు ఉండడంతో ఈ సినిమాలో నవ్వులకు లోటు లేదని ట్రైలర్ చెబుతోంది. 

ఈ భువన విజయం చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే టీజర్, థీమ్ సాంగ్ ఆడియన్స్ లో ఆసక్తి పెంచేశాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

More Telugu News