Honey Rose: ఇప్పుడు అందరి దృష్టి ఈ అందాల భామపైనే!

Honey Rose Special

  • గ్లామరస్ హీరోయిన్ గా హనీ రోజ్ కి క్రేజ్
  • మలయాళంలో స్టార్ హీరోల జోడీగా ఆమె బిజీ  
  • ఇక్కడ కూడా ఆమెకి పెరుగుతున్న ఫాలోయింగ్
  • త్వరలోనే ఇక్కడి సీనియర్ హీరోల సరసన సందడి చేసే ఛాన్స్ 

సాధారణంగా తెలుగు తెరకి కొత్త హీరోయిన్స్ పరిచయమవుతుంటారు. కొంతమంది ఇతర భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసి, ఆ తరువాత టాలీవుడ్ దిశగా అడుగులు వేయడం జరుగుతూ ఉంటుంది. ఇక మరికొంతమంది ఇతర భాషల్లో కథానాయికగా వరుస సినిమాలు చేసి, కాస్త ఆలస్యంగానే తెలుగు తెరపైకి వస్తుంటారు. ఇంతకాలం ఈ బ్యూటీ ఏమైపోయిందబ్బా అనిపిస్తూ ఉంటారు. 

అలాంటి కథానాయికల జాబితాలో హనీరోజ్ ఒకరుగా కనిపిస్తుంది. హనీరోజ్ పేరు వినగానే కుర్రాళ్లు ఊహాలోకంలోకి వెళ్లిపోతారు. ఇలాంటి గ్లామర్ ను ఈ మధ్య కాలంలో చూడలేదనే విషయాన్ని చర్చలు పెట్టి మరీ చెప్పుకుంటారు. అంతటి అందం ఆమె సొంతం. గతంలో ఒకటి రెండు తెలుగు సినిమాల్లో మెరిసిన ఆమె, 'వీరసింహారెడ్డి'లో బాలయ్య సరసన నాయికగా ఒక రేంజ్ లో మెప్పించింది. 'హానీ రోజ్ ను చూడగానే భలే అమ్మాయిని పట్టుకొచ్చారేనని అనుకున్నాను' అని బాలయ్య అనడం గమనించవలసిన విషయం. 

'వీరసింహా రెడ్డి' తరువాత హనీ రోజ్ ఇక్కడ వరుస సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.  అందుకు కారణం ఆమెకి అవకాశాలు లేక కాదు .. అవకాశాల కోసం ఎదురుచూసే పరిస్థితిలో ఆమె లేదు. ఎందుకంటే ఆమె మలయాళంలో మంచి క్రేజ్ ఉన్న ఆర్టిస్ట్.  మమ్ముట్టి .. మోహన్ లాల్ .. సురేశ్ గోపీ .. జయసూర్య వంటి వారితో నటించిన అనుభవం ఉంది. అందువలన ఇక్కడ సీనియర్ స్టార్ హీరోల సరసన మంచి ఛాన్స్ వస్తేనే చేయాలనే ఆలోచనలో ఆమె  ఉందట. ఇక ఇక్కడి సీనియర్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్న మేకర్స్ ముందుగా ఆమెపేరునే పరిశీలిస్తున్నారనేది బలంగా వినిపిస్తున్న టాక్.

Honey Rose
Balakrishna
Veerasimha Reddy
  • Loading...

More Telugu News