Rohit Sharma: హర్ష భోగ్లేని ఆటపట్టించిన రోహిత్ శర్మ.. ఇదిగో వీడియో

Rohit Sharma Leaves Harsha Bhogle Stumped Over 36th Birthday Comment

  • నిన్న 36వ పుట్టినరోజు జరుపుకున్న రోహిత్ శర్మ
  • ఐపీఎల్ 1,000వ మ్యాచ్ లో జట్టును గెలిపించి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చిన సహచరులు
  • ప్రజెంటేషన్ సందర్భంగా హర్ష భోగ్లేను ఆశ్చర్యపరిచిన రోహిత్

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిన్న 36వ పడిలో అడుగుపెట్టాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఐపీఎల్ 1,000వ మ్యాచ్ లో జట్టును గెలిపించి తమ కెప్టెన్ కు గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారు సహచర ఆటగాళ్లు. మ్యాచ్ తర్వాత ప్రజెంటేషన్ టైమ్ లో కామెంటేటర్ హర్ష భోగ్లేను రోహిత్ శర్మ ఆటపట్టించాడు.   

తొలుత ప్రజెంటేషన్ టైమ్ లో మాట్లాడేందుకు ఎంఐ కెప్టెన్ రోహిత్ శర్మను హర్ష భోగ్లే ఆహ్వానించాడు. ‘‘కెప్టెన్ గా 150వ మ్యాచ్, ఎంఐకి 190వ మ్యాచ్, నీ 36వ బర్త్ డే రోజున గెలిచావు’’ అని హర్ష చెబుతుండగానే జోక్యం చేసుకున్న రోహిత్.. ‘36వ బర్త్ డే కాదు.. 35’ అని అన్నాడు.

దీంతో ఆశ్చర్యపోయిన హర్ష.. ‘అవునా.. వాళ్లు నాకు ఒకటి ఎక్కువ చెప్పినట్లు ఉన్నారు. గుడ్ కరెక్షన్’ అని కవర్ చేయబోయాడు. వెంటనే రోహిత్ శర్మ.. ‘కాదు కాదు.. 36వదే’ అని చెప్పి గట్టిగా నవ్వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. తొలుత రాజస్థాన్ 213 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ముంబై రికార్డు స్థాయిలో లక్ష్యాన్ని ఛేదించింది. చివర్లో టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. చివరి ఓవర్ లో 17 పరుగులు అవసరం కాగా.. తొలి 3 బంతుల్లో 3 సిక్సులు కొట్టి ముంబైని గెలిపించాడు. మొత్తం 8 మ్యాచ్ లు ఆడిన ముంబై.. 4 గెలిచింది. పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది.

More Telugu News