Vardhan: ఆటలో గెలవాలంటే ఆడటం మాత్రమే తెలిస్తే సరిపోదు: 'హీట్' ట్రైలర్ డైలాగ్!

HEAT movie update

  • కొత్త హీరో హీరోయిన్లతో రూపొందిన 'హీట్'
  • మర్డర్ మిస్టరీ నేపథ్యంలో నడిచే కథ 
  • ఆసక్తిని రేపుతున్న ట్రైలర్ 
  • ఈ నెల 5వ తేదీన సినిమా విడుదల

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు ద్వారా, చాలామంది కొత్త హీరోలు .. హీరోయిన్లు పరిచయమవుతున్నారు. అలా కొత్త హీరో .. హీరోయిన్లను పరిచయం చేస్తూ రూపొందిన సినిమానే 'H.E.A.T' (ఎ సైకో మైండ్ వర్సెస్ ఎ బ్రోకెన్ హార్ట్). వర్ధన్ - స్నేహా ఖుషి ఈ సినిమాలో నాయకా నాయికలుగా నటించారు. 

వర్మ - సంజయ్ నిర్మించిన ఈ సినిమాకి, అర్జున్ - శరత్ వర్మ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ అనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. హంతకుడి కోసం పోలీసుల గాలింపుకి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

హంతకుడు ఎవరు? ఎందుకోసం హత్యలు చేస్తూ వెళుతున్నాడు? అనేది ఆసక్తిని రేకెత్తించే విషయం. "మనకి అర్హత లేనివాటిని టచ్ చేయాలంటే గుండె ధైర్యం ఉండాలి", "ఆటలో గెలవాలంటే ఆడటం మాత్రమే తెలిస్తే సరిపోదు. ప్రత్యర్థులను సరిగ్గా అంచనా వేయగలిగి ఉండాలి" వంటి డైలాగ్స్ ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ నెల 5వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. 

Vardhan
Sneha Khushi
HEAT Movie

More Telugu News