Vimanam: విమానం’ చిత్రం నుంచి ‘సిన్నోడా ఓ సిన్నోడా...’ లిరికల్ సాంగ్ ప్రోమో విడుదల

Chinnoda O Chinnoda lyrical song promo from Vimanam movie

  • సముద్రఖని, మాస్టర్ ధ్రువన్ ప్రధాన పాత్రల్లో విమానం
  • శివప్రసాద్ యానాల దర్శకత్వంలో చిత్రం
  • తెలుగు, తమిళ భాషల్లో జూన్ 9 మూవీ రిలీజ్

తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న వైవిధ్యమైన చిత్రం ‘విమానం’. శివప్రసాద్ యానాల ఈ సినిమాకు దర్శకుడు. విలక్ష‌ణ న‌టుడు స‌ముద్రఖ‌ని ఇందులో వీర‌య్య అనే మ‌ధ్య వ‌యసు తండ్రి పాత్ర‌లో న‌టించారు.  ప్ర‌తీ తండ్రి త‌న  కొడుకుని ఉన్నతంగా చూసుకోవాల‌ని అనుకుంటాడు. 

విమానం సినిమాలో స‌ముద్రఖ‌ని భార్య లేకపోయినా, అంగ వైకల్యంతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ, కొడుకుని ప్రేమ‌గా పెంచుకుంటాడు. అలాంటి తండ్రీ కొడుకుల మ‌ధ్య ప్రేమానుబంధాన్ని గొప్ప‌గా ఆవిష్క‌రించేలా రూపొందిన పాట ‘సిన్నోడా ఓ సిన్నోడా’. ఈ లిరికల్ సాంగ్ మే 2న రిలీజ్ కానుంది. 

అయితే సదరు పాటలోని ఎమోషన్స్ ఎలా ఉంటాయో చూపించేలా సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది. చిత్ర సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ పాటను రాయటం విశేషం. ప్రముఖ సింగర్ మంగ్లీ పాటను తనదైన స్టైల్లో ఎంతో శ్రావ్యంగా ఆలపించిన‌ట్లు సాంగ్ ప్రోమో చూస్తే అర్థ‌మ‌వుతుంది. 

జీ స్టూడియోస్‌, కిరణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమా రూపొందుతోంది. జూన్ 9న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. 

అలాగే చిత్ర నిర్మాత‌లు ఆడియెన్స్‌ను వారి తొలి విమాన ప్ర‌యాణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను #MyFirstVimanam కు ట్యాగ్ చేస్తూ @VimanamTheFilm అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయాలని ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో పాల్గొనే పార్టిసిపెంట్స్‌కు బ‌హుమతుల‌ను కూడా అందిస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.  

కాగా, ఈ చిత్రంలో సముద్ర ఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధన్ రాజ్, రాజేంద్రన్ తదితరులు నటించారు.

Vimanam
Samudrakhani
Chonnoda O Chinnoda
Lyrical Song
Promo
Tollywood
Kollywood

More Telugu News