Gopichand: మీ నాన్న చేసిన మంచి నీకు చాన్స్ వచ్చేలా చేసింది: హీరో గోపీచంద్ తో దర్శకుడు తేజ

Teja answers Gopichand questions

  • గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా రామబాణం చిత్రం
  • శ్రీవాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా
  • మే 5న రిలీజ్
  • ప్రమోషన్స్ లో పాలుపంచుకున్న సీనియర్ దర్శకుడు తేజ

గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం రామబాణం. ఈ సినిమా మే 5న రిలీజ్ అవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సీనియర్ దర్శకుడు తేజ హీరో గోపీచంద్ ను ఇంటర్వ్యూ చేశారు. ఇందులో గోపీచంద్ కూడా తేజను పలు ప్రశ్నలు అడిగారు. తేజ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం జయంలో గోపీచంద్ విలన్ అని తెలిసిందే. 

జయం చిత్రంలో నన్ను తీసుకోవడానికి కారణం ఏంటి? నన్ను తీసుకోవాలని మీకు ఎవరు చెప్పారు? అని తేజను గోపీచంద్ అడిగారు. 

అందుకు తేజ బదులిస్తూ... మీ నాన్న టి.కృష్ణ రికమెండ్ చేయడం వల్లే జయం సినిమాలో నిన్ను తీసుకున్నాను అని వెల్లడించారు. 

"మీ నాన్న వద్ద నేను పనిచేశాను. తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలకు వస్తుందని అందరూ చెబుతుంటారు. ఆ విధంగా మీ నాన్న చేసిన మంచి నీకు అవకాశం తెచ్చిపెట్టింది. నేను కేవలం నీకు ఓ రహదారి లాంటివాడిని. నువ్వు గోల్ వరకు వెళ్లడానికి కారణం మీ నాన్న మంచి ప్రవర్తనే" అని గోపీచంద్ తో అన్నారు.

Gopichand
Ramabanam
Teja
T.Krishna
Jayam
Tollywood
  • Loading...

More Telugu News